News July 26, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ బాండ్ హీరో

జేమ్స్ బాండ్ హీరో జార్జ్ లాజెన్‌బీ తన సినీ కెరీర్‌కు స్వస్తి పలికారు. 1969లో వచ్చిన ‘ఆన్ హర్ మెజేస్టిస్ సీక్రెట్ సర్వీస్’ చిత్రంలో ఐకానిక్ బాండ్ రోల్‌లో ఆయన నటించారు. రిటైర్మెంట్ నిర్ణయం అంత తేలిక కాదని, ఇకపై నటనతో పాటు ఈవెంట్లకు దూరంగా ఉంటానని తెలిపారు. ఇంటర్వ్యూలుకు స్వస్తి పలుకుతున్నట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. మ్యాన్ ఫ్రమ్ హాంకాంగ్, నెవర్ టూ యంగ్ టు డై వంటి చిత్రాల్లో ఆయన నటించారు.
Similar News
News April 4, 2026
ముంబై తడ’బ్యాటు’

IPL: ఢిల్లీతో మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న ముంబై తడబడుతోంది. 10 ఓవర్లలో 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (35), రికెల్టన్ (9), తిలక్ వర్మ (0) ఔటయ్యారు. సూర్య (29*), రూథర్‌ఫర్డ్ (5*) క్రీజులో ఉన్నారు. ముకేశ్ కుమార్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం ముంబై స్కోర్ 11 ఓవర్లలో 80/3గా ఉంది.
News April 4, 2026
వాషింగ్టన్ మేయర్ రేసులో భారత సంతతి మహిళ

US రాజధాని వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో భారత సంతతికి చెందిన రినీ సంపత్(31) దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అర్హత సాధించడానికి రినీ దాఖలు చేసిన పిటిషన్‌పై 4,500 మందికి పైగా సంతకాలు చేశారు. తమిళనాడులో జన్మించిన ఆమె ఏడో ఏట పేరెంట్స్‌తో కలిసి USకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఇంటర్నేషనల్ రిలేషన్స్&సెక్యూరిటీలో పట్టా పొందారు.
News April 4, 2026
ఆస్ట్రేలియాకు తిరిగెళ్లిన కమిన్స్.. SRHలో చేరిక మరింత ఆలస్యం!

బ్యాటింగ్‌లో అదరగొడుతున్న SRH స్పెషలిస్ట్ బౌలర్లు లేక ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీమ్‌లో చేరినప్పటికీ వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న పాట్ కమిన్స్ మ్యాచ్‌లు ఆడట్లేదు. తాజాగా ఫైనల్ మెడికల్ స్కాన్ కోసం ఆయన ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు. ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతిస్తే ఈ నెల 17న భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. లేదంటే మరింత ఆలస్యం కానుంది.


