News July 26, 2024
మరో 2 రోజుల్లో ‘దేవర’తో స్టెప్పులు: శేఖర్ మాస్టర్

ఎన్టీఆర్ ‘దేవర’పై శేఖర్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ షేర్ చేశారు. డాన్స్‌కు ప్రాధాన్యమున్న పాటలో ఎన్టీఆర్‌తో స్టెప్పులేయించనున్నట్లు తెలిపారు. 2రోజుల్లో ఆ షూట్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గత సినిమాల్లో పక్కా లోకల్, యాపిల్ బ్యూటీ వంటి హిట్ సాంగ్స్‌కు శేఖర్ పనిచేశారు. ఈ నేపథ్యంలో ‘దేవర’ డాన్సులు ఎలా ఉండనున్నాయా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News April 18, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.
News April 18, 2026
IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.
News April 18, 2026
SRHలోకి సౌతాఫ్రికా పేసర్

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.


