News July 26, 2024
అసెంబ్లీ సమావేశాలు.. విద్యార్థుల ప్రత్యక్ష వీక్షణ!

AP: ఏపీలో తొలిసారిగా విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు సభ ప్రారంభం నాటి నుంచి రోజుకు వివిధ కాలేజీలకు చెందిన 100 మంది విద్యార్థులను సభలోకి అనుమతిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్ర రాజకీయాలు, సభల పనితీరుపై విద్యార్థులకు అవగాహన వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News December 29, 2025
IIT ధన్‌బాద్‌లో 105 పోస్టులు… అప్లై చేశారా?

<
News December 29, 2025
వివక్షపై భారతీయుడి పోరాటం.. అహంకారానికి ₹81 లక్షల గుణపాఠం

బ్రిటన్‌లోని ఓ KFC అవుట్‌లెట్‌లో పనిచేసే తమిళనాడు యువకుడు మాధేశ్ రవిచంద్రన్ జాతి వివక్షపై కోర్టులో పోరాడి గెలిచాడు. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం మాధేశ్‌ను శ్రీలంక తమిళుడైన తన మేనేజర్ ‘బానిస’ ‘భారతీయులంతా మోసగాళ్లు’ అని అవమానించేవాడు. తట్టుకోలేక మాధేశ్ ఉద్యోగానికి రాజీనామా చేసి కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సుమారు ₹81 లక్షల పరిహారం చెల్లించాలని మేనేజర్‌ను ఆదేశించింది.
News December 29, 2025
ఐదేళ్లలోపు పిల్లలకు ఇవి పెట్టకూడదు

పిల్లలకు కొన్నిరకాల ఆహారపదార్థాలు పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఏడాదిలోపు పిల్లలకు తేనె పెడితే బొట్యులిజం అనే వ్యాధి వస్తుంది. దీంతో చిన్నారుల్లో చూపు మందగించడం, అలసట, నీరసం వస్తాయి. అలాగే పాశ్చరైజేషన్ చేయని పాలు, జ్యూసులు, పెరుగులో ఈ.కొలి బ్యాక్టీరియా పెరిగి విరేచనాలు, బరువు తగ్గడం వంటివి జరుగుతాయి. అలాగే స్వీట్లు, ఉప్పు కూడా ఎక్కువగా ఇవ్వకూడదని సూచిస్తున్నారు.


