News July 26, 2024
ఒలింపిక్స్: ఏ క్రీడలో ఎంతమంది పాల్గొంటున్నారంటే?

ఒలింపిక్స్‌లో మొత్తం 16 క్రీడల్లో 117 మంది భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 29మంది, వెయిట్ లిఫ్టింగ్, ఈక్వెస్ట్రియన్, జుడో, రోయింగ్‌లలో ఒక్కొక్కరు పాల్గొంటున్నారు. షూటింగ్ 21, హాకీ 19, టేబుల్ టెన్నిస్ 8, బ్యాడ్మింటన్ 7, రెజ్లింగ్ 6, బాక్సింగ్ 6, ఆర్చరీ 6, గోల్ఫ్ 4, టెన్నిస్ 3, సెయిలింగ్, స్విమ్మింగ్‌లో ఇద్దరు చొప్పున ఆడతారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News January 8, 2026
ACB కేసుల్లో దర్యాప్తు జరగాల్సిందే: సుప్రీంకోర్టు

AP: ACB నమోదు చేసిన FIRలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ACB సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(CIU)-విజయవాడ ఫైల్ చేసిన అన్ని FIRలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 6నెలల్లో తుది నివేదిక ఇవ్వాలని, ప్రతివాదులను అరెస్ట్ చేయొద్దని సూచించింది. ACB CIUకు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదనే కారణంతో FIRలను హైకోర్టు గతంలో కొట్టేసింది. దీన్ని SCలో ACB సవాలు చేసింది.
News January 8, 2026
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రుల దండయాత్ర

AP: జగన్ అమరావతిపై చేసిన <<18799615>>కామెంట్స్<<>> రాష్ట్రంలో ముందుగానే భోగి మంటలు రాజేశాయి. మంత్రులు ఒక్కొక్కరుగా కౌంటర్ అటాక్‌కు దిగారు. ఇటీవల YCP చేసిన ఏ ఆరోపణల మీదా ఇలా వెంటనే ఎదురుదాడి చేయలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రానికి కీలకమైన అంశం, రూ.వందల కోట్ల మేర పనులు జరుగుతున్న ప్రాంతంపై ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లొద్దనే ఇలా రియాక్ట్ అయినట్లు టాక్.
News January 8, 2026
3 మ్యాచులకు తిలక్ వర్మ దూరం

న్యూజిలాండ్‌తో జరిగే 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి 3 మ్యాచులకు తిలక్ వర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మిగతా 2 మ్యాచుల్లో ఆయన ఆడే విషయంపై ఫిట్‌నెస్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిన్న ఆయనకు సర్జరీ జరిగినట్లు పేర్కొంది. తిలక్ ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని, రేపు HYDకు వస్తారని వెల్లడించింది. IND, NZ టీ20 సిరీస్ ఈ నెల 21 నుంచి జరగనుంది.


