News July 26, 2024
విశాఖలో కేజీ టమాటా రూ.38 మాత్రమే

విశాఖపట్నంలో 13 రైతు బజార్లో జేసీ కె.మయూర్ అశోక్ ఆదేశాలనుసారం వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రూ.38కే టమాటా విక్రయాలు జరిగాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారు. ఐదు రోజులుగా ధర తగ్గుతూ వస్తుండడంతో రైతు బజార్లో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
Similar News
News November 3, 2025
విశాఖలో దంపతుల మృతిపై వీడని మిస్టరీ

అక్కయ్యపాలెం సమీపంలో భార్యాభర్తలు వాసు, అనిత <<18182096>>మృతిపై<<>> పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో బెడ్‌పై అనిత మృతదేహం, వాసు ఉరితాడుకు వేలాడడం అనుమానాలకు తావిస్తోంది. భార్యను చంపిన అనంతరం వాసు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వివాహం జరగగా వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని బంధువులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
News November 2, 2025
అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి: ఏసీబీ డీజీ

ప్రతి ఒక్కరు అవినీతికి వ్యతిరేకంగా పోరాడితేనే ఫలితం ఉంటుందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా పాత బస్టాండు స్టేడియం వద్ద భారీ ర్యాలీ ప్రారంభించారు. అవినీతిపై ఫిర్యాదు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు 1064 నంబర్‌కు తెలియజేయాలని సమిష్టిగా పోరాడితే అవినీతి పారద్రోలవచ్చని అన్నారు. రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 2, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు PGRS

విశాఖ కలెక్టరేట్‌లో ఈనెల 3న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.


