News July 26, 2024
PAYTM యూజర్లూ.. ఈ మెసేజ్ వచ్చిందా?

ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం నుంచి వస్తోన్న మెసేజ్‌లతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. యూజర్లు తమ బ్యాంకు అకౌంట్‌ను UPIకు యాక్టివేట్ చేసినట్లు తెలుపుతూ PAYTM మెసేజ్‌లు పంపుతోంది. అయితే, తాము యాక్టివేట్ చేయకపోయినా ఇలాంటి మెసేజ్ వస్తున్నాయని, అసలేం జరుగుతోందని నెట్టింట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. PAYTM తన పేమెంట్స్ బ్యాంక్‌ను తొలగించడంతో UPIకి సదరు బ్యాంకును లింక్ చేస్తోందట.
Similar News
News December 28, 2025
గుడ్ న్యూస్.. స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు!

TG: పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఏటా సగటున 12.55 లక్షల మంది e PASS వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా 2025-26లో ఈ సంఖ్య 7.65 లక్షలు మాత్రమే ఉంది. గడువు పొడిగింపుపై ఎల్లుండిలోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది.
News December 28, 2025
సిల్వర్ షాక్.. నెలలో ₹82,000 జంప్

సరిగ్గా నెల క్రితం KG వెండి ధర ₹1,92,000. ఇప్పుడది ₹2,74,000కు చేరింది. కేవలం నెలరోజుల్లోనే ₹82,000 పెరిగింది. ‘పేదవాడి బంగారం’గా పిలిచే వెండి ఇప్పుడు తానూ బంగారం బాటలోనే నడుస్తానంటోంది.. దీంతో కొనలేక సామాన్యులు.. అమ్మకాలు లేక వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ రానుండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులు కావడం పక్కాగా కనిపిస్తోంది!
News December 28, 2025
DRDOలో JRF పోస్టులు

DRDO పరిధిలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(<


