News July 26, 2024

నరసాపురం- మచిలీపట్నం కొత్త రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్

image

సముద్ర తీరం వెంట కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బ్రిటీష్ హయాం నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన నరసాపురం- మచిలీపట్నం మధ్య లైన్‌కు సర్వే చేయాలని నిర్ణయించింది. తాజా కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే నరసాపురం పెద్ద జంక్షన్‌గా మారనుందని తీరప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 28, 2026

భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.

News February 27, 2026

కలెక్టరుకు చాక్‌పీస్‌ మైక్రోఆర్ట్‌ బహూకరణ

image

పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్‌పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు. తన పేరును ఇంత సూక్ష్మంగా, కళాత్మకంగా చెక్కడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.