News July 26, 2024
జగన్ ఇండియా కూటమిలో చేరడం అనివార్యం: యనమల

AP: బీజేపీని అడ్డుపెట్టుకుని జగన్ ఇన్నాళ్లూ పబ్బం గడుపుకున్నారని TDP MLC యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇప్పుడు తాము, జనసేన NDAలో ఉండటంతో ఆ కూటమిలోకి YCP అధినేత రాలేని పరిస్థితి ఉందని చెప్పారు. ‘ఇండియా కూటమిలో జగన్ చేరడం అనివార్యం. ఆయనకు ఢిల్లీలో షెల్టర్ కావాలి. ఆ కూటమికి కూడా పార్టీల అవసరం ఉంది. జగన్ ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు రావడమే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 22, 2025
విక్కీ అదరగొడుతున్నాడుగా..

‘ఛావా’ హీరో విక్కీ కౌశల్.. ఈ పేరు ప్రస్తుతం బాలీవుడ్‌లో మాత్రమే కాదు ఇతర ఇండస్ట్రీల్లోనూ మార్మోగుతోంది. విభిన్న స్క్రిప్ట్ సెలక్షన్స్‌తో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. URI, సర్దార్ ఉధమ్, సామ్ బహాదుర్ వంటి చిత్రాలతో ఆయన సత్తా చాటారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే షారుఖ్ ఖాన్ ‘డుంకీ’, రణ్‌బీర్ కపూర్ ‘సంజూ’ చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌తో మెప్పించారు. హీరోయిన్ కత్రినా కైఫ్‌ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
News February 22, 2025
3, 4, 5 క్లాసుల విలీనంపై త్వరలో కీలక నిర్ణయం

AP: ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 క్లాసులను తిరిగి విలీనం చేయడంపై ఎన్నికల కోడ్ తర్వాత విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వం ఆయా క్లాసులను UPS, హైస్కూళ్లలో కలిపేయడంపై వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఇక టెన్త్ విద్యార్థులకు సెలవుల్లో స్పెషల్ క్లాసులు తీసుకున్న టీచర్లకు CCL ఆప్షన్ కల్పిస్తామని అధికారులు తెలిపారు. టీచర్ల బదిలీలపై ప్రైమరీ సీనియారిటీ జాబితాను కోడ్ తర్వాత రిలీజ్ చేస్తామన్నారు.
News February 22, 2025
రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్ నమోదు

TG: వేసవి ఇంకా పూర్తిగా రాకుండానే విద్యుత్ వినియోగం పీక్స్‌కు చేరుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా 16,293 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలు వాడేశారు. ఈ నెలలోనే 5న 15,820 మెగావాట్ల వాడకం చరిత్ర సృష్టిస్తే ఆ రికార్డును తాజా వాడకం రోజుల వ్యవధిలోనే దాటేసింది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక సమ్మర్ పరిస్థితేంటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.