News July 26, 2024

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం

image

కర్నూలు-కడప జాతీయ రహదారిలోని శిరివెళ్ల మెట్ట వద్ద శుక్రవారం కూల్ డ్రింక్స్ లోడుతో వెళుతున్న ఆటోకు రోడ్డు ప్రమాదం జరిగింది. కోవెలకుంట్ల నుంచి శిరివెళ్ల వైపు వెళుతున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై శిరివెళ్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 11, 2026

గ్యాస్ సిలిండర్ పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసే అవకాశాలున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం హెచ్చరించారు. ప్రత్యేక ఆఫర్లు, వెంటనే బుకింగ్ చేయాలంటూ వచ్చే తప్పుడు సందేశాలను నమ్మవద్దన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లు ఉపయోగించాలని సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, ఓటీపీ లేదా బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని పేర్కొన్నారు.

News March 11, 2026

కర్నూలు జిల్లా రైతులకు తీపి కబురు

image

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సహాయం ఈ నెల 13న విడుదల కానుందని జేడీఏ వరలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన రైతులకు రూ.6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,72,757 మంది లబ్ధిదారులకు రూ.154.94 కోట్లు అందుతాయని జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. ఈ నిధులు డీబీటీ ద్వారా రైతుల ఖాతాలకు చేరుతాయి.

News March 11, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 153 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 153 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,242 మందికి గానూ 4,089 మంది మాత్రమే హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వెల్లడించారు. నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.