News July 26, 2024
గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీఅడిక్షన్ సెంటర్లు: అనిత

AP: రాష్ట్రంలోని గంజాయి, డ్రగ్స్ బానిసల కోసం డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అనిత తెలిపారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. ‘గత పాలకులు రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారు. యువతకు ఉపాధి లేక డ్రగ్స్ రవాణా చేశారు. దాడుల సంఖ్యపై మాజీ సీఎం జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారు. దాడులకు గురైనవారి జాబితా ఇస్తే మేం అక్కడకు వెళ్తాం’ అని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
Similar News
News April 4, 2026
15వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్!

త్వరలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CGL-2026 నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. దాదాపు 15వేల అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), ఎస్సై, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తదితర గ్రూప్-B, C పోస్టులు ఉన్నాయి. దీనికి డిగ్రీ అర్హత ఉండాలి. నోటిఫికేషన్ విడుదల అయ్యాక దరఖాస్తు తేదీలు వెల్లడించనున్నారు.
News April 4, 2026
ప్రేమ విఫలమై పెళ్లి నిరాకరిస్తే నేరం కాదు: హైకోర్టు

తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. ప్రేమించి ఆ పిదప పెళ్లికి నిరాకరించడం అన్ని సందర్భాల్లోనూ నేరం/మోసం కిందకు రాదని, కేవలం వాగ్దాన ఉల్లంఘన మాత్రమేనని స్పష్టం చేసింది. పెద్దపల్లి జిల్లా పొట్యాలకు చెందిన సంతోష్ ఓ యువతితో ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. తర్వాత పెళ్లి చేసుకోలేదనే కారణంతో ఆమె అతనిపై కేసు పెట్టింది. దీనిపై సంతోష్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు కేసును కొట్టేసింది.
News April 4, 2026
GK: జన్యు సంబంధ వ్యాధులు.. లక్షణాలు

✒ తలసీమియా: హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనతకు దారి తీస్తుంది.
✒ కలర్ బ్లైండ్‌నెస్: ఎరుపు, ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు.
✒ సికిల్‌సెల్ ఎనీమియా: రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. నొప్పి, ఇన్ఫెక్షన్లు, ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది.
✒ ఆల్బినిజం: చర్మం, జుట్టు, కళ్లకు రంగునిచ్చే మెలనిన్ లోపిస్తుంది. దీనివల్ల చర్మం, జుట్టు తెల్లరంగులోకి మారతాయి. కంటిచూపు సమస్యలొస్తాయి.


