News July 26, 2024

భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు

image

ఐఫోన్ ధరలను యాపిల్ సంస్థ తగ్గించింది. బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసింది. దీంతో 15 ప్రో మోడల్ ధర రూ.5100, ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.6వేలు తగ్గాయి. SE మోడల్ ధర రూ.2300 తగ్గింది. భారత్‌లో తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలూ రూ.300 తగ్గాయి. కాగా బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని 20 నుంచి 15శాతానికి కేంద్రం తగ్గించింది.

Similar News

News April 4, 2026

రాఘవ్ చడ్ఢా రాజ్యసభ సభ్యత్వం పోతుందా?

image

రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్ఢాను తొలగించిన ఆప్ ఇప్పుడు ఆయన్ను MPగా కూడా తొలగిస్తుందా అనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ ఎంపీని తొలగించే హక్కు పార్టీకి ఉండదు. పార్టీ పదవి నుంచి సస్పెండ్ చేసినా రాజ్యసభ సభ్యత్వం కొనసాగుతుంది. 6 ఏళ్లు సభ్యుడిగా టర్మ్ పూర్తి చేయొచ్చు. విభేదాలున్నా సరే ఆప్ నుంచి రాఘవ్ చడ్ఢాను ఇప్పటికిప్పుడు సస్పెండ్ చేయకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

News April 4, 2026

కరకట్టపై వెళ్తుంటే శ్మశానమే కనిపిస్తోంది: బొత్స

image

AP: అమరావతిలో కృష్ణా కరకట్టపై వెళ్తుంటే శ్మశానమే కనిపిస్తోందని YCP నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘అమరావతిపై GOVTది ప్రచారార్భాటమే. అక్కడి అవినీతికి తప్ప YCP దానికి వ్యతిరేకం కాదు. తీర్మానాలతో అమరావతి పర్మినెంట్ అయిపోయిందనుకుంటే పొరపాటే. దాన్ని శాసన రాజధానిగానే చూస్తాం. రెండేళ్లైనా నిర్మాణాలు పూర్తిచేయలేదు’ అని మండిపడ్డారు. అనేక సమస్యలుండగా అమరావతినే అభివృద్ధి చేస్తామంటే కుదరదన్నారు.

News April 4, 2026

సిమ్రాన్.. 50 ఏళ్ల వయసులోనూ ట్రెండీగా..

image

1990లలో తన అందం, అభినయంతో యువతను కట్టిపడేసిన సిమ్రాన్ ఇవాళ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మోడ్రన్ డ్రెస్సులో ట్రెండీగా కనిపించారు. 50 ఏళ్లు వచ్చినా లేటెస్ట్ స్టైల్‌తో అదుర్స్ అనిపించారు. సిమ్రాన్ తెలుగులో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, కలిసుందాం రా, నువ్వు వస్తావని, డాడీ, సీతయ్య తదితర హిట్ సినిమాల్లో నటించారు.