News July 26, 2024
కర్నూలుకు నేరుగా రైల్వే లైన్

కర్నూలు, నంద్యాల జిల్లాలను కలుపుతూ అవసరమైన రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే బడ్జెట్‌లో పొందుపరిచారు. దీనికి అనువుగా సిమెంట్ నగర్ నుంచి దూపాడు రైల్వే స్టేషన్ వరకు 47 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. దీంతో హైదరాబాదు నుంచి కర్నూలుకు వస్తున్న రైళ్లను నంద్యాల వరకు పొడిగించే అవకాశం ఉంది.
Similar News
News January 17, 2026
కర్నూలులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్-1, ఫ్రెంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-1, రెగ్యులర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గడువు ఈనెల 27 వరకు ఉందన్నారు. దరఖాస్తులను రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలన్నారు. www.ecourtskurnool.com & kurnool.dcourts.gov.inను చూడాలన్నారు.
News January 17, 2026
కర్నూలులో మహిళా దొంగల అరెస్ట్

కర్నూలు ఆర్టీసీ బస్టాండులో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన రోజీ సుల్తానా, షేక్ రఫీకా అనే మహిళలను 4వ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నవంబర్ 30న శారద అనే మహిళ కోవెలకుంట్ల బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగులోని 9 తులాల బంగారు నగలను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి, అరెస్టు చేసినట్లు 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు.
News January 17, 2026
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు యువతి

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్‌లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్‌బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.


