News July 26, 2024
MHBD: మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని డోర్నకల్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మంత్రితో ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Similar News
News February 7, 2026
వరంగల్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుండటంతో కొత్త వాటి కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ నిబంధనల మేరకు పకడ్బందీగా అక్రిడిటేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు.
News February 7, 2026
కేయూ దూర విద్య అడ్మిషన్ల నోటిఫికేషన్

కేయూ దూరవిద్య కేంద్రం పరిధిలో యూజీ, పీజీతో పాటు ఇతర కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను శుక్రవారం వీసీ ప్రొఫెసర్
ప్రతాపరెడ్డి విడుదల చేశారు. మార్చి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని డైరెక్టర్ సురేన్‌లాల్ తెలిపారు. ఇతర వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. అలాగే ఈ నెల 17 నుంచి 27 వరకు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి 8.15 గంటల వరకు జూమ్ వేదికగా ఎన్ఐపీ ఆన్‌లైన్ సదస్సు నిర్వహించనున్నారు.
News February 6, 2026
ఫార్మసీ అధికారుల సమస్యలను పరిష్కరిస్తాం: డీఎంహెచ్‌వో

ఫార్మసీ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు అదనపు పోస్టుల మంజూరు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీఎంహెచ్‌వో డాక్టర్ బి. సాంబశివరావు తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల ఫార్మసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పోస్టుల మంజూరు కోసం రాష్ట్ర స్థాయి అధికారులకు లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు.


