News July 26, 2024

సింగర్ పోస్ట్.. సలార్ మూవీ నటుడిపై లైంగిక ఆరోపణలు

image

నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధించాడంటూ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. గతంలోనూ ఇతర మహిళలతో ఇలానే వ్యవహరించాడని పలు స్క్రీన్‌షాట్లను ఆమె పంచుకోవడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. బాలయ్య భగవంత్ కేసరి మూవీతో పాటు, ప్రభాస్ సలార్ పార్ట్-1 లోనూ విజయ్ కనిపించారు.

Similar News

News January 11, 2026

సినిమా టికెట్ల రేట్లపై కమీషన్ల దందా: హరీశ్ రావు

image

TG: ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు. ఈ కమీషన్ల దందాపై గవర్నర్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘ఓవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో ఇస్తారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రేమో తనకు తెలియదంటారు. ఇదేం పాలన’ అంటూ CM రేవంత్, ప్రభుత్వంపై ఫైరయ్యారు.

News January 11, 2026

చెరకు సాగు-విత్తనం ఎంపికలో జాగ్రత్తలు

image

చీడపీడలు, తెగుళ్లు ఆశించని ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. చెరకు గడపైన ఉన్న మూడోవంతు లేత భాగాన్ని మాత్రమే విత్తనంగా ఉపయోగించాలి. గడలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు మాత్రమే, విత్తనం నుంచి మొలక శాతం ఆశాజనకంగా ఉంటుంది. అందువల్ల లేత భాగాలను విత్తనంగా ఉపయోగించటం ఉత్తమం. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల మూడుకళ్ల ముచ్చెలను విత్తనంగా వాడాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 11, 2026

పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే..?

image

దేవుని ప్రసాదంగా పొందిన పసుపును పూజా గదిలో ఉంచి నిత్యం పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నీటిలో కలిపి స్నానం చేస్తే చర్మరోగాలు తొలగి దేహకాంతి పెరుగుతుంది. ఇంటిని పసుపు నీటితో శుద్ధి చేస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయి. వివాహ దోషాలు ఉన్నవారు పసుపు గౌరీని పూజించాలి. వ్యాపార స్థలాల్లో పసుపు నీరు వాడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే పసుపు దానం చేయడం శ్రేయస్కరం. ఫలితంగా ఇంట్లో దైవకళ ఉట్టిపడి, సకల శుభాలు కలుగుతాయి.