News July 27, 2024
TODAY HEADLINES

* వైసీపీ హయాంలో రూ.9.74లక్షల కోట్ల అప్పులు: చంద్రబాబు
* రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నమ్మిస్తున్నారు: వైఎస్ జగన్
* పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: రేవంత్
* కాళేశ్వరం పంపులు ప్రభుత్వం ఆన్ చేయాలి.. లేదంటే మేమే చేస్తాం: KTR
* నీట్ యూజీ(రివైజ్డ్) ఫలితాలు విడుదల
* మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు IND, SL
Similar News
News July 5, 2025
భారత్ డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 427/6 వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ గిల్ డిక్లేర్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ 607 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ (161), రాహుల్ (55), పంత్ (65) జడేజా (69*) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మరికాసేపట్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.
News July 5, 2025
DECLARE ఇవ్వరా? కెప్టెన్ మదిలో ఏముంది?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం 565 పరుగులు దాటింది. కానీ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. రేపు ఒక రోజు మాత్రమే ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్‌గా డిక్లేర్ ఇస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉందని చర్చించుకుంటున్నారు. భారత్ మరీ ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News July 5, 2025
సింగరేణి 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి..

TG: 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా ఇందులో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటైంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. విపత్తు సమయంలో ధైర్యంగా, నైపుణ్యంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందానికి అభినందనలు తెలిపారు.