News July 27, 2024
మరికల్: అయిల్ పామ్ తోటలతో అధిక లాభాలు: కలెక్టర్ సిక్తా
అయిల్ పామ్ తోటలు పెంచడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం మరికల్ మండలం కన్మనూర్ గ్రామంలో రైతు మోహన్ రెడ్డి సాగు చేస్తున్న అయిల్ పామ్ తోటలను పరిశీలించారు. తోటల యాజమాన్య పద్ధతులు, దిగుబడి రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని, తోటలు పెంచేందుకు ముందుకు రావాలన్నారు.
Similar News
News November 29, 2024
బాలానగర్ సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయండి: SKLTSHU
బాలానగర్ మండల సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మండలంలో పుట్టిన సీతాఫలం ఇతర జిల్లాల్లో విస్తరించింది. ఈ చెట్టుకు అందమైన ఆకులు, గుండ్రని ఆకారంలో రుచికరమైన పండ్లు ఉంటాయి. ఈ సీతాఫలాలు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు వస్తే ఈ రకానికి చట్టబద్ధత రక్షణ కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
News November 29, 2024
వణికిస్తోన్న చలి.. కోస్గిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 5 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా కోస్గి, ఎల్లికల్‌లో 12.9 ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12.9నుంచి 18.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 29, 2024
MBNR: ఆస్పత్రిలో బాలింత మృతి.. నర్సులపై వేటు
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో<<14731958>> బాలింత మృతి<<>> ఘటనలో ఇద్దరు నర్సులను వైద్యాధికారి సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గండీడ్ మం. ఆసిరెడ్డిపల్లికి చెందిన రజిత కాన్పుకోసం బుధవారం ఆస్పత్రిలో చేరారు. రాత్రి బిడ్డకు జన్మనించిన ఆమె.. గురువారం ఉదయం చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విరమించారు.