News July 27, 2024
విద్యార్థి మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి

నెల్లూరులోని KNR ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మరణించారన్న విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమరావతిలోని తన ఛాంబర్లో ఉన్న మంత్రి నారాయణకు ఆ సమయంలో అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ప్రమాద విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణ చేయాలని డీఈవోకు మంత్రి ఆదేశించారు.
Similar News
News September 16, 2025
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నడం హాస్యాస్పదం : మంత్రి ఆనం

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం హాస్యాస్పదమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. 11 మంది వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ఏం చేయదలచుకున్నారనీ ఆత్మకూరులో మంగళవారం ఆయన ప్రశ్నించారు. 11 నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు మీకు పట్టవా? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న ఆలోచన లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అమలు చేస్తున్నామని వివరించారు.
News September 16, 2025
నెల్లూరు నగరపాలక సంస్థలో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు

నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇన్ఛార్జ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకటేశ్, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ శివకుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కమిషనర్ నందన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని కనకమహాల్ సెంటర్లో మూడంతస్తుల భారీ భవంతి నిర్మిస్తున్నారు. దానికి ఎలాంటి అనుమతులు లేవు. వ్యవహారాన్ని మేయర్ స్రవంతి ఇటీవల బయటపెట్టడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
News September 16, 2025
నెల్లూరు: డీఎస్సీలో 16 మిగులు సీట్లు

నెల్లూరు జిల్లా నుంచి డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 673 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 657 మంది ఎంపికయ్యారు. 16 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.