News July 27, 2024
నేరస్థులు తప్పు చేయాలంటే భయపడాలి: ఎస్పీ ఉదయ్

పాపన్నపేట: నేరస్థులు తప్పు చేయాలంటే భయపడాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ధైర్యం నింపాలన్నారు. ముఖ్యంగా డయల్ 100 వ్యవస్థపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News September 16, 2025
మాసాయిపేట: అనారోగ్యంతో విద్యార్థిని మృతి

మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని భవాని అనారోగ్యంతో మృతి చెందింది. అనారోగ్యం కారణంగా ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో ఆమె చనిపోయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భవాని సాఫ్ట్‌బాల్ క్రీడలో చురుకుగా ఉండేది. ఆమె మృతి పట్ల ఉపాధ్యాయులు, స్నేహితులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
News September 16, 2025
రేపటి నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలకై స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం రేపటి నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులలో మహిళలకు బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనత స్క్రీనింగ్ చేయనున్నారు.
News September 15, 2025
మెదక్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు పక్కాగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. మెదక్ బాలికల హై స్కూల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 22 నుంచి 28 వరకు ఈ పరీక్షలు 6 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.