News July 27, 2024
HYD: త్వరలో రెడ్ కేటగిరీ పరిశ్రమల PCB రిపోర్ట్!

రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(PCB) పరిశ్రమల్లో విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలకు చెక్ పెట్టటం కోసం ప్రతినెలా రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో తనిఖీలు చేస్తోంది. జులైకి సంబంధించి తనిఖీ చేయాల్సిన 26 పరిశ్రమలు రాజధాని పరిధిలోనే ఉండగా..వాటిల్లో ప్రభుత్వ పరిశ్రమలు కూడా ఉన్నాయి. మల్కాజ్గిరి-15, HYD-5, RR-6 పరిశ్రమల్లో తనిఖీ జరగనుంది. త్వరలోనే రిపోర్టు విడుదల చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు.
Similar News
News August 5, 2025
HYD: ఏపీ టీడీపీ ఎంపీ కొడుకంటూ మోసం.. వ్యక్తి అరెస్ట్

AP TDP ఎంపీ కుమారుడిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని KPHB పోలీసులు ఈరోజు తెలిపారు. KPHBలో సితార ఉమెన్స్ హాస్టల్ నిర్వాహకురాలికి నమ్మకంగా వ్యవహరించి, బంగారు చైన్ డిజైన్ చేస్తానంటూ 4తులాల గొలుసు, రూ.లక్షను దండుకున్నాడన్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అనుమానం వచ్చి మహిళ PSలో ఫిర్యాదు చేసింది. అతడిపై AP, TGలో ఇప్పటికే 9 కేసులు ఉన్నట్లు గుర్తించారు.
News August 5, 2025
BREAKING: HYD: కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్

ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. 2010బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ టి.కిరణ్ HYD మీర్‌చౌక్ PSలో విధులు నిర్వహిస్తూ 8ఏళ్ల క్రితం సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ ఎత్తివేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చిలకలగూడ PSపరిధి శ్రీనివాస్ నగర్‌లోని తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 60శాతం గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
News August 5, 2025
నాగరం: పోలీసులపై హైకోర్టు సీరియస్

నాగారంలోని భూదాన్ భూములపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. పోలీసులు బెదిరిస్తున్నారని పిటీషనర్ రాములు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భూదాన్ భూములపై పిటీషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించగా హాజరైన కానిస్టేబుల్ వేంకటేశ్వర్లు, సీఐ వేంకటేశ్వర్లు చెప్పినందుకే ఫోన్ చేసినట్లు తెలిపారు. మరోసారి రిపీట్ కావద్దని హైకోర్టు తెలిపింది.