News July 27, 2024
HYD: RRR ఉత్తర భాగానికి NH-161AA నంబర్!

HYD నగర శివారు RRR ఉత్తర భాగానికి రాష్ట్రంలోని NHAI సంస్థ NH-161AA నంబరును తాత్కాలికంగా కేటాయించినట్లు తెలిపింది. RRR ఉత్తరభాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఆరు ప్యాకేజీల్లో 161KM మేర కొనసాగునుంది. దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆమనగల్, షాద్‌నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189KM నిర్మాణం కానుంది.
Similar News
News August 5, 2025
BREAKING: బాచుపల్లిలో యాక్సిడెంట్.. స్టూడెంట్ మృతి

HYD బాచుపల్లి PS పరిధిలోని ప్రగతినగర్ ఎలీప్ సర్కిల్ వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న మూసాపేట్ అంజయ్య నగర్‌కు చెందిన స్టూడెంట్ నిఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
News August 5, 2025
HYD: ఏపీ టీడీపీ ఎంపీ కొడుకంటూ మోసం.. వ్యక్తి అరెస్ట్

AP TDP ఎంపీ కుమారుడిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని KPHB పోలీసులు ఈరోజు తెలిపారు. KPHBలో సితార ఉమెన్స్ హాస్టల్ నిర్వాహకురాలికి నమ్మకంగా వ్యవహరించి, బంగారు చైన్ డిజైన్ చేస్తానంటూ 4తులాల గొలుసు, రూ.లక్షను దండుకున్నాడన్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అనుమానం వచ్చి మహిళ PSలో ఫిర్యాదు చేసింది. అతడిపై AP, TGలో ఇప్పటికే 9 కేసులు ఉన్నట్లు గుర్తించారు.
News August 5, 2025
BREAKING: HYD: కానిస్టేబుల్ సూసైడ్ అటెంప్ట్

ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. 2010బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ టి.కిరణ్ HYD మీర్‌చౌక్ PSలో విధులు నిర్వహిస్తూ 8ఏళ్ల క్రితం సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ ఎత్తివేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చిలకలగూడ PSపరిధి శ్రీనివాస్ నగర్‌లోని తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 60శాతం గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.