News July 27, 2024
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కి సెలవు
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} తల్లాడ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ పర్యటన
Similar News
News August 5, 2025
విద్యార్థుల ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి: ఐటీడీఏ పీఓ

విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్
సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల ప్రిన్సిపల్, హెచ్ఎం, వార్డెన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్లూరు ఎస్టీ బాలికల హాస్టల్‌లో జరిగిన పరిణామాలు హెచ్చరికగా భావించి ఇకముందు ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.
News August 5, 2025
జిల్లా కలెక్టర్‌తో ఐటీడీఏ పీవో భేటీ

ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఐటీడీఏ పీవో మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో ఐటీడీఏ పరిధిలో ఉన్న పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News August 5, 2025
‘జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం’

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రికి జర్నలిస్టులు పలు సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సతీష్ గౌడ్, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.