News July 27, 2024

అప్రోచ్ రోడ్డు లేని గ్రామాలను గుర్తించండి: కలెక్టర్

image

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అప్రోచ్ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కలెక్టర్ రంజిత్ బాషా పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో R&B, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రోచ్ రోడ్డు వేయని గ్రామాలను గుర్తించాలని ఆదేశించారు. ఇందులో రెండు కిలోమీటర్ల లోపు రోడ్లు ఉంటే, వాటిని ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్లను నిర్మిస్తామని తెలిపారు.

Similar News

News January 13, 2026

ఓర్వకల్లుకు ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులు: మంత్రి

image

తమ ప్రభుత్వం ప్రజల కోసం సమర్థవంతంగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం దృష్టి పెట్టిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. 46వ వార్డు నరసింహారెడ్డి నగర్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కర్నూలు, ఓర్వకల్లుకు ఇప్పటికే రూ.10,000 కోట్ల పెట్టుబడులు అందించామని తెలిపారు. అబ్దుల్ కలాం పాఠశాల సమస్యకు పరిష్కారం కోసం కూడా కృషి చేస్తున్నారన్నారు.

News January 13, 2026

రైతులకు సులభంగా పంట రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రైతులు పంట సాగులో ఎదుర్కొంటున్న పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లు సులభంగా పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. ఖరీఫ్‌ 2026, రబీ 2026-27 పంటలకు కూలీ ఖర్చులు, పెట్టుబడులు, గతేడాది ధరలను పరిగణలోకి తీసుకొని రుణ పరిమితులు నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.

News January 13, 2026

ఇంటిల్లిపాది సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి: డీఐజీ

image

తెలుగు సంస్కృతి సంప్రదాయ మేళవింపు సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది సంతోషంగా జరుపుకోవాలని డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా భోగి, మకర, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.