News July 27, 2024

కలికిరి: మర్రికుంటపల్లి వీఆర్ఓపై ఏసీబీ అధికారులు విచారణ

image

కలికిరి మండలం మర్రికుంటపల్లి వీఆర్వో క్రిష్ణయ్యపై ఎంఆర్ఓ సమక్షంలో ఏసీబీ అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. కామాక్షి అనే మహిళకు గజ్జలవారిపల్లి గ్రామం వద్ద తల్లి నుంచి సంక్రమించిన 23సెంట్ల భూమి ఆన్లైన్ చేయాలని వీఆర్ఓ ను ఆశ్రయించింది. వీఆర్ఓ రూ.5లక్షలు తీసుకున్నట్లు ఆరోపించింది. ఆన్లైన్ చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా వారి ఆదేశాలతో ACB అధికారులు విచారణ చేపట్టారు.

Similar News

News September 18, 2025

అక్టోబర్ 4లోపు దరఖాస్తు చేసుకోండి: DMHO

image

పారామెడికల్ ట్రైనింగ్ 2025-26 కోర్సుల్లో ఉచిత ప్రవేశానికి అక్టోబర్ 4 వరకు గడువు పెంచినట్లు DMHO సుధారాణి బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.appmb.co.in వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్లను జత చేసి రూ.100లను DMHO కార్యాలయంలో అందించాలన్నారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News September 18, 2025

విద్యార్థిపై దాడి.. పవన్ కళ్యాణ్ విచారం

image

పుంగనూరులోని ఓప్రైవేటు స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి తల ఎముక చిట్లడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. స్కూల్, ఇంట్లో పిల్లలు అల్లరి చేయడం లాంటివి చేస్తే వారి మానసిక ధోరణిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్నారు. విద్యార్థికి సమస్యలు తలెత్తడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బుధవారం అధికారులను ఆదేశించారు.

News September 17, 2025

భార్య కాపురానికి రాలేదని కత్తితో దాడి

image

కుప్పం (M) బైరప్ప కొటాలకు చెందిన కీర్తి(18)కి రెండేళ్ల కిందట తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. ఐదు నెలల కిందట డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వచ్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టి నాలుగు నెలలు కావస్తున్నా భార్య కాపురానికి రాలేదని, తనతో సరిగ్గా మాట్లాడటం లేదని మనస్థాపనానికి గురైన రాజేష్ తన భార్య గొంతు కోసి, ముఖంపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.