News July 27, 2024
ఇసుక ఛార్జీలు వసూలు చేయట్లేదు: ప్రకాశం కలెక్టర్
ఇసుక స్టాక్ పాయింట్ల నిర్వహణ ఖర్చులు తప్ప ప్రజల నుంచి ప్రత్యేకంగా ఇసుక ఛార్జీలు వసూలు చేయలేదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 26 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. కొత్త ఇసుక విధానంలో రవాణా ఛార్జీల పరంగా వ్యత్యాసం లేకుండా చూస్తామని తెలిపారు.
Similar News
News November 5, 2024
పామూరు: మద్యం మత్తులో ముగ్గురిపై కత్తితో దాడి
మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన పామూరు మండలం నుచ్చుపొదలలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. తిరుపాల్ రెడ్డి, సురేంద్ర శనివారం మద్యం మత్తులో గొడవపడ్డారు. సురేంద్ర స్థానిక నేత రహముతుల్లా సహాయంతో తిరుపాల్ రెడ్డిని పిలిపించి పంచాయితీ పెట్టారు. ఆగ్రహంతో తిరుపాల్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో రహముతుల్లా కుమారుడు నిజాముద్దీన్, బంధువు హజరత్, సురేంద్రలపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు.
News November 5, 2024
ప్రకాశం: నేటి నుంచి డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షలు
ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలోని 88 డిగ్రీ కళాశాలలో చదువుతున్న మూడో సెమిస్టర్ విద్యార్థులకు నవంబర్ 5వ తేదీ నుంచి, 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్శిటీ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బి పద్మజ తెలిపారు. ఈ పరీక్షలకు గాను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 88 డిగ్రీ కళాశాల నుంచి మొత్తం 6942 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.
News November 4, 2024
రేపు ఉమ్మడి ప్రకాశం జిల్లా YCP సమీక్షా సమావేశాలు
ప్రకాశం జిల్లా రీజనల్ కో- ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి రేపు ఉదయం మంగళవారం 10:00 గంటలకు ఒంగోలు పార్టీ ఆఫీస్లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మండల పార్టీ అధ్యక్షుడు, MPPలు, ZPTCలు, మున్సిపల్ ఛైర్మన్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.