News July 27, 2024

ఏపీకి అదనంగా 30 మంది ఐపీఎస్‌లు

image

AP: రాష్ట్రానికి అదనపు ఐపీఎస్‌లను కేటాయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఐపీఎస్‌ల కొరత, ఇతర అంశాలపై వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా మరింత మంది అధికారుల అవసరముందని విన్నవించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అదనంగా 30 మంది IPS అధికారుల్ని కేటాయించింది. దీంతో ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్‌లు సంఖ్య 174కి చేరనుంది.

Similar News

News September 14, 2025

బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక

image

ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాపై శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 139/5 రన్స్ మాత్రమే చేసింది. జాకిర్ అలీ (41*), షమీమ్ హుస్సేన్(42*) మాత్రమే రాణించారు. లంక బ్యాటర్లు 32 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ని ముగించేశారు. నిస్సంక హాఫ్ సెంచరీ, కమిల్ మిషారా(46*), కెప్టెన్ అసలంక(10*) రాణించారు. బంగ్లా బౌలర్స్ మహేదీ హసన్ 2, ముస్తఫిజుర్, తన్‌జిమ్ చెరో వికెట్ తీశారు.

News September 14, 2025

ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి: విజయ్

image

ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని సినీ హీరో, TVK చీఫ్ విజయ్ అన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ పేరుతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి, ఎలక్షన్స్ పెట్టాలని BJP చూస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని మండిపడ్డారు. 500కుపైగా హామీలు ఇచ్చిన DMK ఎన్ని నెరవేర్చిందని ప్రశ్నించారు. కానీ CM స్టాలిన్ సిగ్గులేకుండా అన్నీ నెరవేర్చామని చెప్పుకుంటున్నారని అరియలూర్‌ రోడ్ షో‌లో ఫైరయ్యారు.

News September 14, 2025

బాలయ్య తరఫున సీఎంకు రూ.50 లక్షల చెక్కు అందజేత

image

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల రైతులకు అండగా నిలిచేందుకు CMRFకు నందమూరి బాలయ్య రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెక్కును ఆయన తరఫున చిన్న కూతురు తేజస్విని సీఎం రేవంత్‌కు అందజేశారు. ఇటీవల విరాళం ప్రకటించిన సందర్భంగా భవిష్యత్తులోనూ తన వంతుగా ఇలాంటి సహాయాలు చేస్తానని బాలయ్య పేర్కొన్నారు.