News July 27, 2024

ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద

image

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు, పరివాహక ప్రాంతాల నుంచి వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.17 టీఎంసీలు కాగా.. 16.91 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 14,349 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగగా.. 331 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.

Similar News

News February 4, 2026

జమ్మికుంట పురపోరు.. బీసీలకు 42 శాతం టికెట్లు

image

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కృషి చేశారు. 30వార్డుల్లో అధికారులు ఆన్‌రిజర్వ్ -మహిళా 8, ఆన్‌రిజర్వ్- జనరల్ 7 కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్ లో బీసీ-8, ఎస్సీ-3, OC-4 వార్డులకు B-ఫారం కేటాయించారు. ఈ నిర్ణయంతో బహుజన వర్గాలకు న్యాయం జరిగిందని, బీసీల రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుందని నేతలు హర్షం వ్యక్తం చేశారు

News February 4, 2026

HZBDలో 42% బీసీ రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ కృషి

image

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కృషి చేశారు. 30 వార్డుల్లో అధికారులు ఆన్‌రిజర్వ్-మహిళా 8, ఆన్‌రిజర్వ్-జనరల్ 7 స్థానాలను కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్‌లో BC-8, SC-5, OC-2 వార్డులు కేటాయించారు. ఈ నిర్ణయంతో బహుజన వర్గాలకు న్యాయం జరిగిందని, BCల రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుందని నేతలు హర్షం వ్యక్తం చేశారు.

News February 4, 2026

జమ్మికుంటలో సత్తా చాటాలని బీజేపీ ప్లాన్

image

జమ్మికుంట గడ్డపై కమలం వికసింపజేయాలని BJP తీవ్రంగా శ్రమిస్తోంది. BRS, కాంగ్రెస్ పార్టీలకు తామే ప్రత్యామ్నాయం అని చాటిచెప్పేలా మొత్తం 30 వార్డుల్లోనూ అభ్యర్థులను ప్రకటించి సమరానికి సై అంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయవాదం, స్థానిక సమస్యలే అజెండాగా BJP అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈసారి ఖచ్చితంగా అత్యధిక సీట్లు గెలిచి తమ సత్తా నిరూపించుకుంటామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.