News July 27, 2024
ఖమ్మం: ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్.. చిన్నారి మృతి
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతిచెందిన ఘటన చింతకాని మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన కటికరాల రామకృష్ణ కూతురు అంజలి శుక్రవారం మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురైంది. అక్కడికక్కడే చనిపోయింది. ఘటనపై కేసు నమోదైంది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 21, 2024
అధికారులు ఏం చేయలేమంటున్నారు: తాతా మధు
భద్రాచలం, పినపాక, మధిర, ములుగు నియోజకవర్గాల నుంచి కోట్లాది రూపాయల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని MLC తాతా మధు ఆరోపించారు. ఈరోజు ఆయన మండలిలో మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ‘లారీలు పట్టకుంటున్నా మంత్రి గారి కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి మేమేం చేయలేం’ అని అధికారులు చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
News December 21, 2024
ఖమ్మం: ఒంటరి మహిళపై అర్ధరాత్రి దాడి
తిరుమలాయపాలెం మండలం పిండిపోలులో గుర్తు తెలియని వ్యక్తులు వెంకటమ్మ అనే మహిళపై దాడి చేశారు. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన వెంకటమ్మకు భర్త లేడు. కిరాణ షాపు నడుపుకుంటూ జీవిస్తోంది. అర్ధరాత్రి సుమారు ఒంటిగంట టైంలో దుండగులు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రూ.10వేలు, గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News December 21, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురాంరెడ్డి పర్యటన ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇంటింటి సర్వే ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు