News July 27, 2024
సంగారెడ్డి: అబ్దుల్ కలామ్ పెన్సిల్ ఆర్టిస్ట్ నివాళి

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్ధంతిని ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన మూగ చిత్ర కళాకారుడు గూడూరు ఆగమప్ప అబ్దుల్ కలాం చిత్రపటాన్ని పెన్సిల్‌తో గీసి శనివారం నివాళులర్పించారు. భారతదేశాన్ని అభివృద్ధి దిశగా కృషి చేసిన అబ్దుల్ కలాం భారతరత్నతో పాటు అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారని ఆర్టిస్టు పేర్కొన్నాడు.
Similar News
News November 11, 2025
మెదక్: సమస్యల సత్వర పరిష్కారానికి… లోక్ అదాలత్: ఎస్పీ

ఈ నెల 15న జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు కోరారు. త్వరగా, తక్కువ ఖర్చుతో, ఇరుపక్షాల సమ్మతితో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్‌లో లభిస్తుందని ఎస్పీ తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, ఆస్తి విభజన వంటి రాజీపడే అవకాశమున్న కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.
News November 10, 2025
మెదక్: ‘ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు’

సంచార పశువైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 2017 సంవత్సరంలో పశు సంచార వైద్యశాలను అందించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్, హెల్పర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే పశువులకు సేవలందిస్తున్న తమకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 10, 2025
ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం

ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో కార్తీక సోమవారం పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు పార్థీవ శర్మ ఆధ్వర్యంలో పూజల అనంతరం మంటపంలో అమ్మవారి ఆకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం మంజీరాలో గంగాహారతి ఇచ్చారు. ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణ మారుమ్రోగించారు.


