News July 27, 2024
52 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరికకు వరద నీరు దగ్గరగా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే భద్రాచలంలోని పలు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలంలోని నన్నపనేని హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు.
Similar News
News September 18, 2025
అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక

ఖమ్మం జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ, జడ్పీ సీఈఓ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.
News September 17, 2025
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి చేయాలి: Dy.CM

ఖమ్మం జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2025
పేదల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం: Dy.CM భట్టి

ఖమ్మం: రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొనసాగుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతాంగం, కూలీలు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాలు అమోఘమైనవని కొనియాడారు.