News July 27, 2024

భద్రాచలం: 52 అడుగులకు గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 52.1 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 12.50 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది.

Similar News

News September 19, 2025

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

image

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఒక ప్రాజెక్ట్ అసోసియేట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* NIT- వరంగల్ 2 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగలవారు సెప్టెంబర్ 23వరకు అప్లై చేసుకోవచ్చు.

News September 19, 2025

‘కల్కి-2’ నుంచి దీపిక ఔట్.. కారణాలివేనా?

image

‘కల్కి-2’ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను <<17748690>>తీసేయడంపై<<>> నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె డిమాండ్స్ వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన టీమ్ మొత్తాన్ని (25 మంది) లగ్జరీ హోటల్‌లో ఉంచాలనడంతో పాటు 25% రెమ్యునరేషన్ పెంచాలని, రోజుకు 5-7గంటలే పనిచేస్తానని డిమాండ్ చేశారట. ఆమె రెమ్యునరేషన్‌ హైక్‌కు ఓకే చెప్పినా, షూటింగ్ టైమ్ తగ్గించడానికి మాత్రం మేకర్స్ ఒప్పుకోలేదని సినీవర్గాలు పేర్కొన్నాయి.

News September 19, 2025

విమానంపై పిడుగు పడితే ఏమవుతుందంటే?

image

వర్షాల సమయంలో ఎగురుతున్న విమానాలు కొన్నిసార్లు పిడుగుపాటుకు గురవుతుంటాయి. అయితే ఎన్ని పిడుగులు పడినా ఫ్లైట్ లోపల ఉన్నవారికి ఏమీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం విమానాలను ఫెరడే కేజ్ అనే లేయర్‌తో తయారు చేస్తున్నారు. ఈ ప్రత్యేక లోహం ఫ్లైట్‌లోకి విద్యుదయస్కాంత క్షేత్రాలు వెళ్లకుండా నియంత్రిస్తుంది. పిడుగు పడగానే ఇవి ఈ లోహపు నిర్మాణం గుండా ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లిపోతాయి. దీని వల్ల ఎవరికీ ఏమీ కాదు.