News July 27, 2024
చంద్రబాబు పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడండి: YCP

AP: ఢిల్లీలో జగన్ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలన్న షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది. ‘ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీతో అత్యంత సన్నిహిత సంబంధాలు నడుపుతోంది చంద్రబాబు కాదా? అక్రమ రాజకీయ సంబంధాల్లో మీరు ఒక పావు మాత్రమే అని, మీ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడటం నేర్చుకోండి’ అని ట్వీట్ చేసింది.
Similar News
News February 13, 2026
పూత, పిందె దశలో మామిడి పంటకు నీరు ఎలా ఇవ్వాలి?

మామిడి తోటలోని చెట్లు అన్నింటికీ పూ మొగ్గలు వచ్చినప్పుడు తోటకు తేలికగా నీరు పెట్టాలి. పిందెలు ఏర్పడ్డాక మామిడి చెట్లకు వీలును బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 తడుల నీటిని అందించాలి. దీని వల్ల పిందెలు రాలడం తగ్గి కాయలు పెద్దవిగా నాణ్యంగా పెరుగుతాయి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అవసరానికి మించి చెట్లకు నీరు పెట్టడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News February 13, 2026
350 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<
News February 13, 2026
శివుడు లింగాకారంలో ఎందుకు?

శివుడు లింగాకారంలో పూజలందుకుంటాడు. అందుకు పురాణాలు 2 కారణాలు చెబుతున్నాయి. వరాహ పురాణం ప్రకారం.. భృగు మహర్షి శాపం వల్ల శివుడు విగ్రహ రూపం వదిలి లింగాకారంలో పూజలందుకుంటున్నాడు. అయితే తాత్విక కోణంలో ‘లింగం’ అంటే ఓ ‘గుర్తు’ లేదా ‘సంకేతం’. నిరాకారుడు, అనంతమైన శూన్య స్వరూపుడైన పరమాత్మను ఆరాధించడానికి శివలింగం ఓ పవిత్ర చిహ్నం. అందుకే రూపం లేని ఆ పరమేశ్వరుడిని భక్తులు లింగరూపంలో కొలుస్తారు.


