News July 27, 2024

ప్చ్.. 10M ఎయిర్ రైఫిల్ పోటీల్లో నిరాశే

image

ఒలింపిక్స్‌: 10M ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ పోటీల్లో భారత రెండు జట్లూ విఫలమయ్యాయి. కనీసం ఫైనల్‌కు వెళ్లలేకపోయాయి. క్వాలిఫయర్స్‌లో ఆఖరి వరకు పోరాడిన రమిత-అర్జున్ జోడీ (628.7) ఆరో స్థానంలో నిలిచింది. ఇక ఇలవేణి-సందీప్ జంట (626.3) 12వ స్థానానికి పరిమితమైంది. ఈ పోటీల్లో మన జట్లు పతకాలు సాధిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. క్వాలిఫయర్స్‌లో టాప్-2 జట్లు స్వర్ణం 3, 4 జట్లు కాంస్యం కోసం పోటీపడతాయి.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News February 26, 2025

36 సార్లు ఢిల్లీకి.. 3 రూపాయలు తేలేదు: KTR

image

TG: 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైరయ్యారు. SLBC ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగితేలారని దుయ్యబట్టారు. 96 గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం పగుళ్లు, శ్రీశైలం అగ్నిప్రమాదంపై కారుకూతలు కూసిన మేధావులు SLBC విషయంలో మాత్రం నోరెత్తడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.

News February 26, 2025

మహాకుంభమేళా ‘సిత్రాలు’

image

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు, నాగ సాధువులు, అఘోరాలు పుణ్య స్నానమాచరించారు. ఈ క్రమంలో పలు ఫొటోలు వైరలయ్యాయి. పైన స్వైప్ చేసి ఫొటోలను చూడొచ్చు.

News February 26, 2025

‘మజాకా’ మూవీ రివ్యూ

image

త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మజాకా’ థియేటర్లలో విడుదలైంది. తండ్రి కొడుకులు తమ ప్రేమను దక్కించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. సందీప్ కిషన్, రావు రమేశ్, మురళీ శర్మల నటన, ఎమోషనల్, కామెడీ సీన్లు, సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్ ఈ సినిమాకు ప్లస్. సాగదీత, స్లో సీన్లు, ఊహించేలా కథ ఉండటం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
WAY2NEWS RATING: 2.25/5

error: Content is protected !!