News July 27, 2024
పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఏపీలో ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గత నెల మాదిరి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయనున్నారు. 1వ తేదీనే 99% పూర్తి చేయాలని, ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలన్నారు. ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ నెల 31నే బ్యాంక్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.
Similar News
News February 8, 2026
ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

T20WC: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.
News February 8, 2026
రూ.100 కోట్లతో BJPని ఓడించాలనుకుంటున్నారు: బండి

TG: MIMతో BRS, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఒవైసీని పంపారు. ఇక్కడ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్‌లా ఉంటాయి. MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. రూ.100కోట్లు ఖర్చు పెట్టి BJPని ఓడించాలనుకుంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఇక్కడ MIM గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరు’ అని కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.
News February 8, 2026
గోవా వెళ్తున్నారా? ఈ పని చేస్తే 24 గంటలు జైలులో ఉండాల్సిందే

గోవాలో ఇష్టానుసారం ఫొటోలు, వీడియోలు తీస్తే 24 గంటలు జైలులో గడపాల్సిందే. పర్మిషన్ లేకుండా విదేశీయులు/ఇండియన్స్ ఫొటోలు తీసినా, సెల్ఫీలకు వేధించినా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. టూరిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసుల నిర్ణయంపై SMలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. నార్త్ గోవా బాగా బీచ్‌లో టూరిస్టులను వేధించిన తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.


