News July 27, 2024

కడప: త్వరలో జిల్లాలో డీఎస్పీలు, సీఐల బదిలీలు

image

కడప జిల్లాలో వివిధ ప్రదేశాల్లో డీఎస్పీలుగా, సీఐలుగా పనిచేస్తున్న వారిని త్వరలో బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేస్తారని పోలీసు వర్గాల ద్వారా వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కడప డీఎస్పీతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు మెడికల్ లీవ్‌లో వెళ్లడం గమనార్హం.

Similar News

News January 14, 2026

సంక్రాంతి ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కలెక్టర్

image

సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, ఐక్యత నింపాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. కడప జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిమళం వెదజల్లేలా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

News January 14, 2026

కడప జిల్లా TDP MLAకి బెదిరింపులు

image

మైదుకూరు MLA సుధాకర్ యాదవ్‌‌తో పాటు అతని కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌ను బెదిరించిన కేసులో ముంబయికి చెందిన నిందితుడు రుషాంత్ జయకుమార్ వాడ్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. RTI కార్యకర్తనని, ఆస్తులను జప్తు చేస్తానని ఈ-మెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరింపులకు దిగాడు. రూ.10 కోట్లు ఇస్తే వదిలి పెడతానని MPని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు దక్షిణ ముంబయిలో అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు.

News January 14, 2026

కడప: 68,207 హెక్టార్లలో పప్పు శనగ సాగు

image

కడప జిల్లాలో ప్రస్తుత రబీలో 68,207 హెక్టార్లలో పప్పు శనగ పంటను రైతులు సాగు చేశారు. వాయుగుండం ప్రభావంతో ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పూత, పిందె దశలోని శనగ పంటకు నష్టం జరిగిందని రైతుల ఆందోళన చెందుతున్నారు. శనగ మొక్కలో కీలకమైన పులుసు వర్షానికి కరిగిపోయిందని రైతులు వాపోతున్నారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో కురిసిన వర్షానికి పులుసు రాలిపోయేంతగా నష్టం లేదని MAO వరహరికుమార్ తెలిపారు.