News July 27, 2024
ప్రతి భారతీయుడి ఆశయమదే: మోదీ

2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడమే ప్రతి భారతీయుడి ఆశయమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రజలతో రాష్ట్రాలకు నేరుగా సత్సంబంధాలు ఉంటాయని, వికసిత్ భారత్-2047లో స్టేట్స్ ప్రధాన పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
Similar News
News February 25, 2025
దుర్మార్గుడు.. ఐదుగురిని హత్య చేశాడు

కేరళలోని తిరువనంతపురంలో 23 ఏళ్ల అఫన్ అనే యువకుడు కొన్ని గంటల వ్యవధిలోనే ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో తన తమ్ముడు, నానమ్మ, ఆంటీ, అంకుల్‌తో పాటు ప్రియురాలు కూడా ఉంది. ఆ దుర్మార్గుడు తల్లిపైనా దాడి చేయగా ఆమె ఆసుపత్రిలో చావుతో పోరాడుతోంది. హత్యల అనంతరం నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తానూ విషం తాగానని చెప్పడంతో షాకైన పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. హత్యలకు కారణాలపై విచారిస్తున్నారు.
News February 25, 2025
ఈ సింగర్ ఇద్దరు స్టార్ హీరోల చెల్లెలు తెలుసా?

సింగర్ బృంద.. తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీల సొంత చెల్లెలు. మిస్టర్ చంద్రమౌళి మూవీతో సింగర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె తర్వాత రాక్షసి, జాక్‌పాట్, పొన్మగల్ వంధాల్, ఓ2లో పాటలు పాడారు. తన వదిన, సూర్య భార్య జ్యోతిక నటించిన పొన్మగల్ వంధాల్‌లో బృంద పాడిన ‘వా చెల్లామ్’ సాంగ్ పెద్ద హిట్టయింది. ఇక రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తమిళ వెర్షన్లో ఆలియాకు ఈమే డబ్బింగ్ చెప్పారు.
News February 25, 2025
హతవిధీ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..!

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే అతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ఓ ICC టోర్నీ జరుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆరు రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. పాక్ ప్రదర్శనపై మీ కామెంట్.