News July 27, 2024

పురుషుల 10M ఎయిర్ ఫిస్టల్ పోటీల్లోనూ ఓటమే

image

ఒలింపిక్స్ షూటింగులో ఓటముల పరంపర కొనసాగుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ పోటీల్లో భారత ఆటగాళ్లు క్వాలిఫయర్స్‌తోనే ఆగిపోయారు. సరబ్‌జీత్ సింగ్ (577 పాయింట్లు) 9వ స్థానంలో నిలిచారు. అర్జున్ (574) 18వ స్థానానికి పరిమితం అయ్యారు. ఫైనల్ చేరాలంటే తొలి 8 స్థానాల్లో నిలవాలి. అంతకు ముందు మిక్స్‌డ్ పోటీల్లోనూ భారత జట్లకు ఓటమి తప్పలేదు. మహిళల పోటీల్లో మనూ భాకర్ ఏమైనా చేస్తుందేమో చూడాలి. #<<-se>>#Olympics2024<<>>

Similar News

News March 4, 2026

ఇరాన్ కొత్త సుప్రీంలీడర్‌గా ఖమేనీ కుమారుడు!

image

అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఎన్నికైనట్లు ఆ దేశ మీడియా సంస్థ ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీని సుప్రీంలీడర్‌గా ఎన్నుకోవాలని IRGC ఆ దేశ మతపెద్దలను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఖమేనీ కార్యకలాపాల్లో మొజ్తాబా కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో మొజ్తాబాకు ఎంతోకాలంగా క్లోజ్ రిలేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

News March 4, 2026

నేడే మొదటి సెమీఫైనల్.. ఫైనల్‌ బెర్త్ ఎవరిదో?

image

T20WC: ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 2024లో ఫైనల్ చేరి భారత్ చేతిలో ఓడిపోయిన ప్రోటీస్ ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో రాణిస్తోంది. మరోవైపు నెట్ రన్‌రేట్ కలిసొచ్చి సెమీస్‌కు వచ్చిన కివీస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. T20I హెడ్ టు హెడ్‌ రికార్డ్‌లో 12 విజయాలతో సఫారీలదే పైచేయి. కాగా రాత్రి 7.00కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

News March 4, 2026

అంగన్‌వాడీల నిరసన.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

image

AP: హామీల కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వ వైఖరి అత్యంత హేయమైనదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలపై లాఠీఛార్జీ చేసి నిర్బంధించడమే కాక ఆహారం, తాగునీళ్లు అందకుండా చేశారని ఆరోపించారు. ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. విజయవాడ ధర్నాలో పలువురు అంగన్‌వాడీల అరెస్ట్‌పై నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిగిన నేపథ్యంలో జగన్ ట్వీట్ చేశారు.