News July 27, 2024

పాక్ BATsకు చైనా మద్దతు! (2/3)

image

పాక్ BATsకు చైనా పరోక్ష మద్దతు ఉందన్నది రక్షణరంగ నిపుణుల అభిప్రాయం. గల్వాన్‌లో భారత సైన్యం చేతిలో దెబ్బతిన్నాక సలామీ స్లైసింగ్‌ ఆగింది. POJKలో వన్‌బెల్ట్ రోడ్డు ప్రాజెక్ట్‌కు దెబ్బపడింది. లక్షల కోట్ల డబ్బు బూడిదలో పోసిన పన్నీరైంది. మరోవైపు శ్రీలంక, బంగ్లా, ఇజ్రాయెల్, ఇరాక్, ఇరాన్‌లో వాళ్లు కన్నేసిన ప్రతి పోర్టును భారత్ కొనేస్తోంది. లక్షద్వీప్, నికోబార్ దీవుల్లో ఆర్మీ బేస్‌లు ఏర్పాటు చేస్తోంది.

Similar News

News November 9, 2025

HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<>HCL<<>>) 64 జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు NOV 27 నుంచి DEC 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.hindustancopper.com/

News November 9, 2025

పాడి పశువుల కొనుగోళ్లు – ఈ జాగ్రత్తలతో మేలు

image

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.

News November 9, 2025

హనుమాన్ చాలీసా భావం – 4

image

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా ||
ఓ దేవా! నీవు బంగారు కాంతులీనే దేహంతో, అత్యంత శోభాయమానమైన సుందర వస్త్రాలను ధరించి విరాజిల్లుతావు. నీ చెవులకు ధరించిన మనోహరమైన కుండలాలు, మృదువుగా మెలికలు తిరిగిన (కుంచితమైన) నీ కేశాలు నీ రూపానికి అసాధారణ సౌందర్యాన్ని చేకూర్చుతాయి. నీ దివ్యమైన రూపం దృష్టిని ఆకర్షించి, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>