News July 27, 2024

వాట్సాప్‌లో వచ్చే అన్ని లింక్స్ క్లిక్ చేయకండి: ఏలూరు SP

image

ఏలూరు ప్రజలకు SP ప్రతాప్ శివకిశోర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SBI- Yono Rewards, Union Bank KYC Update, Electricity Bills, Government Schemes Eligibility పేరుతో సైబర్ నేరగాళ్లు APK ఫైల్స్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంపిస్తున్నారని తెలిపారు. వాటిని ఎవరూ షేర్ చేయొద్దన్నారు. ఎవరైతే ఆ APK ఫైల్స్‌పై క్లిక్ చేస్తారో వారి ఫోన్ హ్యాక్ అయ్యి అకౌంట్‌లోని నగదు ఖాళీ అవుతుందన్నారు.

Similar News

News February 3, 2026

భీమవరం: బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు.!

image

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు రూ.10వేల జరిమానా, బాధితురాలికి రూ.5.80 లక్షల పరిహారం చెల్లించాలని భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ సోమవారం తుది తీర్పు వెల్లడించారు. బాలిక దసరా సెలవులకు ఉండి రాగా మేనత్త కుమారుడు నాగాంజనేయులు పలుమార్లు లైంగికదాడులకు పాల్పడ్డాడు. వార్డెన్‌కు తెలపడంతో వార్డెన్ ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News February 3, 2026

ఈనెల 5న భీమవరానికి మాజీ సీఎం జగన్

image

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 5న భీమవరం రానున్నారు. శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు కుమారుడు చిట్టిరాజు (ఐపీఎస్‌) వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కాళ్ల మండలం పెదమిరం వద్దనున్న రాధాకృష్ణ కల్యాణ మండపానికి చేరుకుని, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్‌ కార్యాలయ వర్గాలు పర్యటన వివరాలను వెల్లడించాయి.

News February 3, 2026

ఈనెల 5న ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా: కలెక్టర్

image

వాసవి పెనుగొండ లో ఈనెల 5 నిర్వహించే ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా‌ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఉద్యోగ దిక్సూచి జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 15 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. యువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులన్నారు. https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.