News July 27, 2024

10M ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కు మనుభాకర్

image

పారిస్ ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ క్వాలిఫయర్స్‌లో మను భాకర్ అదరగొట్టారు. 580 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచారు. పతక పోటీకి అర్హత సాధించారు. కొన్ని సిరీసుల్లో అమేజింగ్ ఫైరింగ్‌‌తో ఆకట్టుకున్న ఆమె ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. ఒకానొక దశలో రెండో ప్లేస్‌కు చేరుకున్నారు. ఆఖర్లో కాస్త తడబడటంతో ర్యాంకు తగ్గిపోయింది. రిథమ్ సంగ్వాన్ తొలుత అదరగొట్టినా అర్హత సాధించలేకపోయారు. #Olympics2024

Similar News

News March 14, 2025

వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

News March 14, 2025

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. అంబటి సెటైర్

image

AP: జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడి పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని సెటైర్ వేశారు.

News March 14, 2025

WPL: ఈ సారైనా కప్పు కొట్టేనా?

image

WPL 2025లో కప్పు కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీపడనున్నాయి. మూడో సారి ఫైనల్ చేరిన DC జట్టు ఈ సారైనా కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు MI రెండోసారి ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముంబైపై ఢిల్లీదే పైచేయి కావడం ఆ జట్టుకు సానుకూలంగా ఉంది. మరి రేపు జరిగే తుది పోరులో DC ఇదే జోరు కొనసాగిస్తుందో డీలా పడుతుందో చూడాలి.

error: Content is protected !!