News July 27, 2024

మరో ఘనత సాధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్

image

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తి 100 మిలియన్ టన్నులకు చేరింది. ఈ పరిశ్రమలో 1990 నవంబర్‌లో ఉత్పత్తిని ప్రారంభించారు. నేటికి 100M టన్నుల మైలురాయిని చేరుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ ఏడాది 7.2M టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా, ముడి సరకు కొరత వల్ల 2, 3 బ్లాస్ట్ ఫర్నేస్‌లు మాత్రమే పనిచేస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు.

Similar News

News January 17, 2026

ఇరాన్ పరిస్థితిపై కీలక ఫోన్ కాల్

image

ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో చర్చించారు. మిడిల్ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌లో నెలకొన్న అస్థిరతపై ఇరువురు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే ఇరాన్‌తో మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని పుతిన్‌ తెలిపినట్లు సమాచారం. శాంతి పునరుద్ధరణకు దౌత్య ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

News January 17, 2026

మట్టి పాత్రకు ₹29 లక్షలు.. 91 ఏళ్ల బామ్మకు బర్త్‌డే సర్‌ప్రైజ్

image

బాల్కనీలో 40ఏళ్లు పడున్న మట్టి పాత్రకు ₹29 లక్షలు వచ్చాయంటే ఆశ్చర్యంగా ఉంది కదా? పైగా బర్త్‌డే రోజు ఆ సర్‌ప్రైజ్ అందితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నెబ్రాస్కా(US)లోని 91ఏళ్ల లోయిస్ జుర్గెన్స్ బామ్మ విషయంలో ఇదే జరిగింది. తొలుత ఆ పాత్రను 50 డాలర్లకు అమ్మాలకున్నారు. తర్వాత Bramer Auction గురించి తెలుసుకొని వేలంలో ఉంచారు. పాత్రపై ఉన్న అరుదైన బ్లూ బటర్‌ఫ్లై మార్కింగ్స్ వల్ల ఏకంగా 300 మంది పోటీ పడ్డారు.

News January 17, 2026

జనవరి 17: చరిత్రలో ఈరోజు

image

1908: సినీనిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ జననం(ఫొటోలో)
1917: సినీ నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్ జననం
1942: బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ జననం
1945: తెలంగాణ కవి, రచయిత మడిపల్లి భద్రయ్య జయంతి
2010: బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు మరణం
1989: దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి భారతీయుడు కల్నల్ జె.కె బజాజ్