News July 27, 2024
ప.గో: ఉద్ధృతంగానే గోదావరి.. అధికారుల అలర్ట్

భద్రాచలం వద్ద శనివారం 4PMకు నీటిమట్టం 53 అడుగులు ఉండగా అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఉమ్మడి ప.గో జిల్లాలో అధికారులు అలర్ట్ అయ్యారు. కలెక్టర్ నాగరాణి వరద ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. లంక గ్రామాల ప్రజలకు భోజనం, వసతి, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. మూగజీవాలకు నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఇబ్బందులున్న చోట వరద బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు.
Similar News
News January 29, 2026
ప.గో: తీర్థం వెళ్లేవారికి గుడ్ న్యూస్

అంతర్వేది భీష్మ ఏకాదశి సందర్భంగా జిల్లాలోని పాఠశాలలకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు ఇచ్చేందుకు డీఈఓ నారాయణ అంగీకరించినట్లు ఫ్యాప్టో నాయకుల తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు హెచ్‌ఎంలు, ఎంఈఓలకు సమాచారం అందించి ఈ సెలవును వినియోగించుకోవచ్చన్నారు. తీర్థం వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాప్టో నేతలు విజయరామరాజు, ప్రకాశం, సాయి వర్మ హర్షం వ్యక్తం చేశారు.
News January 29, 2026
ప.గో: వైకల్యాన్ని జయించి.. విజేతలుగా నిలిచి..

నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ చాటారు. లాంగ్‌జంప్‌లో పెంటపాడుకు చెందిన స్నేహలత, రన్నింగ్‌లో మోగల్లు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి శ్రీరామకృష్ణ వర్మ తృతీయ స్థానాలు సాధించి కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను SSA అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యాంసుందర్, IE కోఆర్డినేటర్ శ్రీనివాస్ అభినందించారు.
News January 29, 2026
ప.గో: పంట కాలువలో మృతదేహం కలకలం

ఆచంట మండలం వేమవరంలోని పంట కాలువలో గురువారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. పొలాలకు వెళ్తున్న రైతులకు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వెంకటరమణ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు.


