News July 27, 2024
త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం: భట్టి

TG: త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. ‘రేషన్ కార్డుల జారీపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశాం. విధివిధానాలు రూపొందిస్తాం. ఆ తర్వాత కొత్త కార్డుల జారీని ప్రారంభిస్తాం’ అని ఆయన ప్రకటించారు. అటు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని.. అందుకోసమే బడ్జెట్‌లో వారికి రూ.20వేల కోట్ల నిధులు కేటాయించినట్లు భట్టి తెలిపారు.
Similar News
News December 29, 2025
పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా?

ఇంటి ప్రధాన గోడకు, ప్రహరీ గోడకు మధ్య ఉండే ఖాళీ స్థలాన్ని ‘పిశాచ స్థానం’ అంటారు. ఈ స్థలం విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు హెచ్చరిస్తున్నారు. ‘ప్రకృతి వనరుల సమతుల్యత దెబ్బతినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఇంటి నిర్మాణంలో ఈ ఖాళీ స్థలాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 29, 2025
ఇసుక సముద్రంలో ఒంటరిగా!

నైజర్ దేశంలోని సహారా ఎడారిలో 400KMS పరిధిలో ఒకే ఒక్క చెట్టు ఉండేది. ఎడారిలో ప్రయాణించేవారికి ఈ ‘టెనెరే వృక్షం’ ఓ దిక్సూచిలా ఉండేది. నీటికోసం భూగర్భంలోనికి తన వేళ్లను విస్తరించి ప్రాణాలు నిలుపుకుంది. ఈ చెట్టు స్థిరత్వానికి, పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచింది. 1973లో ఓ ట్రక్కు డ్రైవర్ చెట్టును ఢీకొట్టడంతో 300 ఏళ్ల దాని ప్రస్థానం ముగిసింది. ప్రస్తుతం దీని అవశేషాలను నైజర్ జాతీయ మ్యూజియంలో భద్రపరిచారు.
News December 29, 2025
2025: అత్యధిక వసూళ్ల చిత్రంగా ‘ధురంధర్’

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ నిలిచింది. ఈ చిత్రం రూ.1034.8కోట్లు రాబట్టింది. IMDb ప్రకారం 2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్-10 మూవీస్ ఇవే.. ధురంధర్, కాంతార-2 (₹853.4Cr), ఛావా(₹808.7Cr), సైయారా(₹575.8Cr), కూలీ (₹516.7Cr), వార్-2 (₹360.7Cr), మహావతార్ నరసింహ (₹326.1Cr), లోక చాప్టర్-1 (₹302.1Cr), OG (₹298.1Cr), హౌజ్‌ఫుల్-5 (₹292.5కోట్లు)


