News July 27, 2024
భువనగిరి: లేడీస్ టాయిలెట్‌లో దుండగుడు.. దేహశుద్ధి

భువనగిరి బస్టాండ్‌లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు. టాయిలెట్‌కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి, స్థానికులను అప్రమత్తం చేసింది. దుండగుడిని కిందకు లాగిన స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
Similar News
News December 30, 2025
BIG BREAKING: NLG: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

TGలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు CDR, CTL, DVK, హాలియా, MLG, NLG, నందికొండ పుర కమిషనర్లతో నిర్వహించిన VCలో ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని ఆదేశాలు అందాయి. ఈ రిజర్వేషన్ల గెజిట్ వెలువడగానే అధికారిక నోటిఫికేషన్ రానుంది.
SHARE IT
News December 30, 2025
నల్గొండ కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్

ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ నూతన కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కలెక్టర్ చంద్రశేఖర్ రేపు లేదా ఎల్లుండి నల్గొండలో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. కాగా, ఇక్కడ పనిచేసిన ఇలా త్రిపాఠి నిజామాబాద్క కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
News December 30, 2025
నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి బదిలీ

ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్ నియమితులయ్యారు. చంద్రశేఖర్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బదిలీ అయిన ఇలా త్రిపాఠి నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.


