News July 27, 2024
జేఎల్ అభ్యర్థులకు ఆగస్టు 5 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు TGPSC ప్రకటించింది. హాల్‌టికెట్ నంబర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. TGPSC ఆఫీసులో ప్రతిరోజు ఉ.10:30 గంటల నుంచి వెరిఫికేషన్ జరగనుంది. సాధారణ అభ్యర్థులను 1:2, PWD అభ్యర్థులను 1:5 రేషియోలో వెరిఫికేషన్‌కు పిలిచింది. 1392 JL పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 3, 2025
రూ.500కే రూ.16 లక్షల ప్లాటు గెలిచింది

TG: లాటరీలో ఓ 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో తీసిన లక్కీ డ్రాలో రూ.500కే ఏకంగా రూ.16 లక్షల విలువైన ప్లాటును గెలుచుకుంది. రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి 66 గజాల ప్లాటుకు లక్కీ డ్రా నిర్వహించారు. శంకర్ అనే వ్యక్తి ఫ్యామిలీ పేరుతో 4 కూపన్లు తీసుకోగా.. 2307 అనే నంబరుతో కుమార్తె హన్సికకు ఈ బహుమతి దక్కింది. రూ.500కే ప్లాటు దక్కడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
News November 3, 2025
Take A Bow: మనసులు గెలిచిన కెప్టెన్ లారా

భారత్ ఉమెన్స్ WCను లిఫ్ట్ చేసినప్పుడు గెలుపు గర్జనతో స్టేడియం మారుమోగింది. అంతా విజయోత్సాహంలో నిండిపోయారు. కానీ, SA కెప్టెన్ లారా ముఖంలో విషాదం నిండిపోయింది. ఫైనల్లో సెంచరీ సహా 9 మ్యాచుల్లో 571 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా SAకి తొలి WC అందించాలన్న తన కల సాకారం కాలేదు. అయితే ఆమె పోరాటం క్రికెట్ అభిమానుల మనసులు గెలిచింది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
News November 3, 2025
షెఫాలీ షో.. చరిత్ర సృష్టించింది

షెఫాలీ వర్మ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించారు. ఫైనల్లో 87 రన్స్ చేయడమే కాకుండా.. 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. వరల్డ్ కప్ ఫైనల్లో ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్ షెఫాలీ(21 ఇయర్స్) కావడం విశేషం. గాయపడిన ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన ఆమె అనూహ్యంగా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘ఏదో మంచి చేయాలనే భగవంతుడు నన్ను జట్టులోకి పంపాడు’ అంటూ షెఫాలీ ఆనందం వ్యక్తం చేశారు.


