News July 28, 2024

భారత బౌలర్‌కు గాయం.. ముఖంపై రక్తపు మరకలు

image

లంకతో జరిగిన తొలి T20లో భారత బౌలర్ రవి బిష్ణోయ్ గాయపడ్డారు. 16వ ఓవర్‌లో అతడు వేసిన తొలి బంతిని లంక బ్యాటర్ కమిందు మెండిస్ కొట్టారు. దాన్ని రిటర్న్ క్యాచ్ అందుకునేందుకు రవి ప్రయత్నించాడు. అందుకునే క్రమంలో అతని కంటి కింద బంతి బలంగా తాకింది. దీంతో ముఖంపై రక్తపు మరకలయ్యాయి. ఆ తర్వాత బ్యాండేజీ వేసుకుని ఆట కొనసాగించిన అతడు.. చివరి బాల్‌కు అసలంకను ఔట్ చేశాడు. బిష్ణోయ్ డెడికేషన్‌పై ప్రశంసలు వస్తున్నాయి.

Similar News

News February 1, 2026

అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలి: హైకోర్టు

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబానికి 24 గంటలూ భద్రత కల్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు దీన్ని కొనసాగించాలని సూచించింది. అంబటి భార్య వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై కోర్టు ఆదేశాలు జారీచేసింది. అంబటి ఇంటిపై దాడి కేసులో న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది.

News February 1, 2026

ఈసారి ఈ ‘శారీ’

image

బడ్జెట్ ప్రసంగం వేళ FM నిర్మలమ్మ ధరించిన కాంచీపురం చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, వెండి తీగపై బంగారు పూత మెరిసే జరీతో దీనిని రూపొందించారు. కోర్వాయ్ పద్ధతిలో చీర, అంచులను విడివిడిగా నేసి బలంగా జత చేయడం వీటి ప్రత్యేకత. మూడు పట్టు దారాల కలయిక వల్ల ఇవి బరువుగా, దృఢంగా ఉంటాయి. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చీరను ఎంపిక చేశారనే <<19018918>>చర్చ<<>> సాగుతోంది.

News February 1, 2026

రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు

image

బడ్జెట్‌లో రైల్వేకు రికార్డు స్థాయిలో ₹2,93,030 కోట్లు కేటాయించారు. ప్రధానంగా కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, ట్రాక్ డబ్లింగ్, ఆధునిక కోచ్‌ల తయారీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రయాణికుల సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 7 హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో మూడింటికి హైదరాబాద్ (బెంగళూరు, చెన్నై, పుణే రూట్లు) కేంద్రంగా ఉండటం విశేషం.