News July 28, 2024
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణకు జిష్ణుదేవ్ వర్మ, రాజస్థాన్‌కు హరిభౌ కిసన్ రావ్, సిక్కింకు ఓం ప్రకాశ్ మాథుర్, మహారాష్ట్రకు సీపీ రాధాకృష్ణన్, జార్ఖండ్‌కు సంతోష్ కుమార్ గంగ్వార్, ఛత్తీస్‌గఢ్‌కు రామన్ దేకా, మేఘాలయకు సీహెచ్ విజయశంకర్, అస్సాం, మణిపుర్‌కు లక్ష్మణ్ ప్రసాద్, పంజాబ్‌కు గవర్నర్‌గా, చండీగఢ్‌కు ఎల్జీగా గులాబ్ చంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
Similar News
News February 16, 2026
ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు కోపం, భయం, బాధ వస్తే లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్ట్ విశేష్. కాబట్టి ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని సూచిస్తున్నారు. కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.
News February 16, 2026
విజయ్- రష్మిక పెళ్లికార్డు వైరల్!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక వివాహం ఈనెల 26న జరగనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఒకటి వైరలవుతోంది. మార్చి 4న 7PMకి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగనుందని అందులో పేర్కొన్నారు. పెళ్లిని బంధువుల సమక్షంలో చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై VD టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
News February 16, 2026
టెక్నాలజీతో పౌర సేవకు బిల్‌గేట్సే ప్రేరణ: సీఎం

AP: రాష్ట్రంలోని ప్రజల జీవితాలను రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్(RTGS) మారుస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలన్నారు. 1990లలో బిల్‌గేట్స్‌తో మీటింగ్ తర్వాత సాంకేతికత ద్వారా పౌర సేవకు ప్రేరణ కలిగిందని Xలో గుర్తు చేసుకున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయంతో సహా అనేక కార్యక్రమాలతోపాటు యంగ్ మైండ్స్‌తో నిండిఉన్న RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించడం సంతోషంగా ఉందని చెప్పారు.


