News July 28, 2024
529 కుటుంబాలకు రూ.3వేల ఆర్థిక సహాయం: కలెక్టర్

గోదావరి వరదల వల్ల తూ.గో జిల్లాలో ముంపునకు గురైన 1,421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరకులు పంపిణీ చేస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. సరకులను ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అందజేస్తామన్నారు. జిల్లాలో 529 వరద బాధిత కుటుంబాలకు ఒకొక్క కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News August 27, 2025
రాజమండ్రి: బార్ లైసెన్సుల కోసం స్పందన అంతంత మాత్రమే

తూ.గో బార్లకు దరఖాస్తులదారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో మరో 22 బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు కోరగా.. మంగళవారం గడువు ముగిసే నాటికి రాజమండ్రి నుంచి 4, ఇతర ప్రాంతాల నుంచి మరో 4 దరఖాస్తులు మాత్రమే ఎక్సైజ్ శాఖకు అందాయి. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు, అధిక లైసెన్స్ ఫీజులు, ఇతర కారణాలతో లైసెన్సుల కోసం వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. కాగా దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 29 వరకు పెంచారు.
News August 27, 2025
రాజమండ్రి: కలువ పువ్వుల కోసం కాలువలోకి దిగి వ్యక్తి మృతి

కొంతమూరు గ్రామానికి చెందిన వంక త్రిమూర్తులు అనే వ్యక్తి కాలువలోకి దిగి కలువ పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం త్రిమూర్తులు అనే వ్యక్తి వినాయక చవితి సందర్భంగా కలువ పువ్వులు కోసం కాలువలోకి దిగాడు. కాలు జారి పడటంతో మునిగిపోయి మృతి చెందాడు. స్థానికులు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
News August 27, 2025
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోండి: ఎస్పీ

వినాయక చవితి వేడుకలు, నిమజ్జన కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పోలీసు వారికి ప్రజలు సహకరించాలని, పర్యావరణాన్ని కాపాడేందుకుగాను మట్టి ప్రతిమలను వినియోగించాలన్నారు.