News July 28, 2024

బ్యాంకాక్‌లో డోన్‌ వాసి కిడ్నాప్‌

image

డోన్‌ (మం) చిన్నమల్కాపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మధుకుమార్‌ను బ్యాంకాక్‌లో కిడ్నాప్‌ చేశారని తండ్రి డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఈనెల 22న చెల్లెలికి ఫోన్‌ చేసి ఉద్యోగానికి 23న బ్యాంకాక్‌ వెళ్తున్నానని చెప్పాడు. 25న తనను కిడ్నాప్‌ చేశారని, రూ.80 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాట్సాప్‌ మెసేజ్ వచ్చింది. తర్వాత నుంచి ఆ ఫోన్‌ స్విచ్ఆఫ్ అయింది.’ అని తండ్రి తెలిపారు.

Similar News

News January 29, 2026

కర్నూలు కలెక్టరేట్ నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీ

image

హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి ఆమె అవగాహన ర్యాలీని ప్రారంభించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజ్ విహార్ సెంటర్ వరకు కొనసాగి ముగిసింది. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు.

News January 28, 2026

రెండో రోజు కొనసాగిన ఇంటర్ ప్రాక్టికల్స్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2వ రోజు ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి. పరీక్షల వివరాలను బుధవారం ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 1,313 మందికి గాను 1,239 మంది హాజరవ్వగా.. 74 మంది గైర్హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1,081 మందికి గాను 1,064 మంది పరీక్ష రాశారని, 17 మంది హాజరు కాలేదని పేర్కొన్నారు.

News January 28, 2026

100 రోజుల కార్యాచరణ అమలు కావాల్సిందే: కలెక్టర్

image

100 రోజుల కార్యాచరణ తప్పనిసరిగా ప్రతీ పాఠశాలలో జరగాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. బుధవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదోని డివిజన్ ఎంఈఓలు, హెచ్ఎంలతో 10వ తరగతికి సంబంధించిన 100 రోజుల కార్యాచరణ అమలుపై డివిజన్ స్థాయి సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల ప్రత్యేక అధికారులు విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారిని ప్రోత్సహించాలన్నారు.