News July 28, 2024

లిక్క‌ర్ ధ‌ర‌లు భారీగా పెంచబోతున్నారు: ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

image

ఇటీవ‌లే కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టిన 2024-25 బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఎక్సైజ్ అంశంపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీర్లు, లిక్క‌ర్ ధ‌ర‌లు రాబోయే రోజుల్లో భారీగా పెంచ‌బోతున్న‌ట్లు బ‌డ్జెట్ అంచ‌నాలు ప‌రిశీలిస్తే స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కులు త‌లదించుకోవాల‌ని ఆయన విమ‌ర్శించారు.

Similar News

News October 1, 2024

సంగారెడ్డి: సెల్ ఫోన్ రిపేరింగ్ పై ఉచిత శిక్షణ

image

సెల్ ఫోన్ రిపేరింగ్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ గ్రామీణ సమయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ సోమవారం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లు వయసున్న వారు అర్హులని చెప్పారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికైన వారికి అక్టోబర్ 14 నుంచి నెలరోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.

News September 30, 2024

కొండా సురేఖపై ట్రోల్స్.. ఖండించిన మంత్రి పొన్నం

image

మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు. బాధ్యత గల ప్రతిపక్షాలు మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై విమర్శించదలుచుకుంటే ఓ హద్దు ఉండాలన్నారు. మహిళా మంత్రులను అవమాన పరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఖండించారు.

News September 30, 2024

నేటి నుంచి ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అవకాశం: కలెక్టర్

image

ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నెంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నెంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.