News July 28, 2024
శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం!

రెండు మూడు రోజుల్లో శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వాయర్‌లో 120 టీఎంసీలకుపైగా నీటి నిల్వ ఉంది. మరో 90కిపైగా టీఎంసీలు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని వదలనున్నట్లు సమాచారం.
Similar News
News August 6, 2025
NLG: వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
బుధవారం ఆమె మాన్యం చెల్క పట్టణ వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి, ఏఎన్‌సీ, మందుల స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే టెస్టులు, ఇతర రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆయా చికిత్సలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News August 6, 2025
NLG: జిల్లాలో తొలిసారిగా సాండ్ బజార్!

జిల్లాలో మొదటి సారిగా మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వం సాండ్ బజార్ ఏర్పాటు చేసింది. మైనింగ్ శాఖ పర్యవేక్షణలో ఈ సాండ్ బజార్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తెస్తోంది. MLG శివారులోని చింతపల్లి బైపాస్ వద్ద స్థలంలో సాండ్ బజార్ ఏర్పాటు చేసింది. ఈ సాండ్ బజార్‌ను గురువారం ప్రారంభించనున్నారు. ఇక్కడ టన్ను ఇసుక రూ.1250లకే విక్రయిస్తారు.
News August 6, 2025
ఏటీసీ, ఐటీఐలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్), ఐటీఐలలో ప్రవేశాలకు ఆన్లైన్లో ఈ నెల 28 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్) NLG కాలేజీ ప్రిన్సిపల్ ఎ.నర్సింహాచారి తెలిపారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయడంతో వారి మొబైల్ నంబర్ రిజిస్టర్‌ను చేసుకోవాలని తెలిపారు. విద్యార్థుల మెరిట్ ప్రకారం ప్రవేశాలు ఉంటాయన్నారు.